సెంచరీ మిస్సయినా.. ప్రపంచ రికార్డ్ సృష్టించిన కోహ్లీ

కోహ్లీ195.74 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేశాడు. ఇందులో అతను ఏడు ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. కోహ్లీ తన తుఫాన్ ఇన్నింగ్స్‌లో చరిత్రలో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. ఈ లీగ్ చరిత్రలో పంజాబ్‌పై 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో కోహ్లి 1000 పరుగులు పూర్తి చేసిన మూడో జట్టుగా పంజాబ్ నిలిచింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ చేయలేని ఫీట్ చేశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో, కోహ్లీ తన కెరీర్‌లో అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా ఆడాడు. 47 బంతుల్లో 92 పరుగులు చేసి స్ట్రైక్‌రేట్‌పై వేళ్లు చూపిన వారి నోరు మూయించాడు
కోహ్లి 195.74 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేశాడు. ఇందులో అతను ఏడు ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. కోహ్లీ తన తుఫాన్ ఇన్నింగ్స్‌లో చరిత్రలో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. ఈ లీగ్ చరిత్రలో పంజాబ్‌పై 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో కోహ్లి 1000 పరుగులు పూర్తి చేసిన మూడో జట్టుగా పంజాబ్ నిలిచింది. ఐపీఎల్‌లో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా కోహ్లీ ఈ మార్కును అధిగమించాడు. వీరితో పాటు డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ మాత్రమే రెండు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు. వార్నర్ పంజాబ్, కోల్‌కతాపై 1000 పరుగులు సాధించగా, రోహిత్ ఢిల్లీ, కోల్‌కతాపై అలాంటి ఫీట్ చేశాడు.