నేడు వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డ్రైవర్ల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

నేడు వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డ్రైవర్ల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు..
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్..

వనపర్తి క్రైమ్ జనవరి 17

  రోడ్డు భద్రత  మాసిత్సవాల్లో  భాగంగా జనవరి 18న  శనివారం వనపర్తి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ రకాలైన వాహన  డ్రైవర్లకు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్  గంగ్వార్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో వైద్య శాఖతో కలిసి  జిల్లాలోని వాహన డ్రైవర్లు ఈ హెల్త్ క్యాంప్ ను సందర్శించి తమ కంటి పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తద్వారా రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని కోరారు.