హైదరాబాద్ :జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ఈనెల 20న మధ్యాహ్నం 12:30 గంటల నుండి ప్రజా సంబరాలు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ప్రకటించారు. ఈ కార్యక్రమం కేబీఆర్ ప్రొమెనేడ్ లో భాగంగా జరుగనుంది. హైదరాబాద్ సాంప్రదాయ వారసత్వ సంపదను కాపాడటం, మూలవాసి కళలకు పునర్జీవం ఇచ్చి, స్థానిక కళాకారులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు.
కేబీఆర్ ప్రొమెనేడ్‌లో కుటుంబాలతో కలసి పాల్గొనేలా సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఫన్ అండ్ అడ్వెంచర్ ఈవెంట్స్ నిర్వహించబడనున్నాయి. ఈ ప్రజా సంబరాల్లో పాల్గొనడానికి ఉచిత ప్రవేశం ఉందని, అయితే ఆర్ట్స్ మరియు పెయింటింగ్ పోటీలలో పాల్గొనదలచినవారు ముందుగా తమ పేరును రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని కమిషనర్ తెలిపారు.
రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలు:
ఇవేణ్ట్‌లో పాల్గొనదలచినవారు తమ పేరును ఖైరతాబాద్ జోనల్ ఆఫీసు లేదా జూబ్లీహిల్స్ సర్కిల్ కార్యాలయాలలో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హైదరాబాద్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక, కళా కార్యక్రమాలను ఆస్వాదించాలని కమిషనర్ ఇలంబర్తి కోరారు.