జాతీయ న్యాయ సేవ హెల్ప్‌లైన్ 15100 టోల్ ఫ్రీ నెంబర్ డిస్ప్లే: స్టిక్కర్లు, బోర్డ్స్ విడుదల

వనపర్తి, అక్టోబర్ 18 :సమాజంలోని ప్రతి వ్యక్తికి న్యాయ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 15100ని ప్రారంభించింది. ఈ నెంబర్ ద్వారా ఎవరైనా న్యాయ సలహాలు లేదా సహాయం కోసం సంప్రదించవచ్చని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎం.ఆర్. సునీత శుక్రవారం తెలిపారు.వనపర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లీష్, తెలుగు భాషల్లో డిస్ప్లే బోర్డ్స్ మరియు స్టిక్కర్లు విడుదల చేయబడ్డాయి. న్యాయ సేవలు అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఉచిత న్యాయ సేవలను పొందవచ్చని, అలాగే https://www.nalsa.gov.in/Isams/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఉచిత న్యాయవాదిని పొందడానికి అవకాశముందని ఆమె పేర్కొన్నారు.సంబంధిత దరఖాస్తులో వివరాలను తెలపడం ద్వారా, న్యాయ సేవలు అవసరమైన వారికి తగిన చర్యలు తీసుకుంటామని, న్యాయ సేవ సంస్థలు అవసరమైన సహాయాన్ని అందజేస్తాయని ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ కార్యదర్శి వీ. రజిని, చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ బాల నాగయ్య, ప్యానల్ న్యాయవాదులు మోహన్ కుమార్, వెంకటరమణ, ఏజీపీ పాల్గొన్నారు.