
దమ్మాయిగూడ,డిసెంబర్16,(సిటీ టైమ్స్): దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి బండ్లగూడలోని చిత్తారమ్మ గుడిలో సోమవారం ఊట్కూర్ నరసింహ గురుస్వామి ఆధ్వర్యంలో పోలు సంతోష్ గౌడ్, గురుస్వామి, మడ్డి పాండు గౌడ్ గురుస్వామి లు కలసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం అయ్యప్ప స్వామి నరేష్ బుచ్చిరెడ్డి జన్మదిన సందర్భంగా హరికృష్ణ యాదవ్ గురు స్వామి ఆధ్వర్యంలో సన్నిధాన స్వాములతో కలిసి బండ్లగూడ చిత్తారమ్మ దేవాలయం ఆవరణంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నరేష్ (బుచ్చిరెడ్డి) అయ్యప్ప స్వాములకు సాయంత్రం అల్పాహారం ను సమకూర్చడం జరిగింది.